![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-700 లో... అపర్ణ దగ్గరికి రాజ్ వచ్చి మీతో కేక్ కట్ చేయించాలనుకుంటున్నాం మీకు ఇష్టమైతే రండి అని అంటాడు. దాంతో అపర్ణ మురిసిపోతుంది. కేక్ కట్ చెయ్యడానికి వెళ్తుంది.
కేక్ కట్ చేస్తుండగా యామిని వచ్చి అక్కడ జరుగుతుందంతా చూసి షాక్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందని యామిని అంటుంది. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావ్ అని రాజ్ అడుగుతాడు. యామిని టెన్షన్ పడుతుంటే.. ఇందాక మీరు బయటికి వెళ్ళినప్పుడు తను ఫోన్ చేస్తే నేనే ఇక్కడికి రమ్మన్నానని కావ్య కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఈవిడ ఎవరు అని యామిని అడుగుతుంది. అమ్మ అని రాజ్ అనగానే.. యామిని షాక్ అవుతుంది. తనది కూడా ఈ రోజు బర్త్ డే అంట.. అందుకే కేక్ కట్ చేస్తున్నామని రాజ్ అంటాడు. రాజ్, అపర్ణ హ్యాండ్ వాష్ కి వెళ్తారు. ఇండైరెక్ట్ గా కావ్య యామినికి కౌంటర్ వేస్తుంది. నువ్వు బయటపడే వరకు నేను బయట పడనని కావ్య అంటుంది. ఇదంతా కావాలనే చేస్తున్నావని యామిని అనుకుంటుంది. రాజ్ వెళ్తు నన్ను ఆశీర్వదించండి అమ్మ అని అపర్ణ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. మా ఇద్దరిని ఆశీర్వాదించండి మాకు పెళ్లి కాబోతుంది అని యామిని అనగానే అపర్ణ షాక్ అవుతుంది. ఇక అపర్ణకి ఇష్టం లేకుండా దీవిస్తుంది.
ఆ తర్వాత కావ్యతో అపర్ణ మాట్లాడుతుంది. రాజ్ ని చూసానని హ్యాపీగా ఉంది. ఆ యామిని ఏంటి అలా మాట్లాడుతుందని అపర్ణ అనగానే.. అదేం లేదు ఆ పెళ్లి జరగదని కావ్య అంటుంది. మరొకవైపు యామిని, రాజ్ ఇంటికి వెళ్తారు. బావ గుళ్లో అన్నదానం చేసాడని యామిని చెప్తుంది. రాజ్ వెళ్ళాక రాజ్ తన అమ్మ బర్త్ డే జరిపించాడని చెప్పగానే యామిని పేరెంట్స్ షాక్ అవుతారు. తరువాయి భాగంలో ఎప్పటిలాగే రాజ్ లేడని రుద్రాణి అంటుంటే రాజ్ ఉన్నాడు.. త్వరలోనే వస్తాడని అపర్ణ చెప్తుంది. వీళ్ళకి ఏదో నిజం తెలిసిందని రుద్రాణి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |